అవనిగడ్డ మండలం చల్లపల్లి నారాయణరావు నగర్ మోడల్ పాఠశాలలో గురువారం పునః ప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ క్లాత్ పంపిణీ చేశారు. సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి చేతుల మీదుగా పంపిణీ జరగగా, మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం పంపిన సన్న బియ్యాన్ని ఆమె పరిశీలించారు. హెచ్ఎం కైతేపల్లి దాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.