సీపీఎం జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా నాయకులు శీలం నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం చల్లపల్లిలోని గుంటూరు బాపనయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో సీపీఎం జిల్లా మహాసభలు చల్లపల్లిలో నిర్వహిస్తామన్నారు. సీపీఎం బలోపేతానికి, అన్ని వర్గాలకు పార్టీని చేరువ చేసేందుకు అనువైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.