స్వచ్ఛ చల్లపల్లి ఆధ్వర్యంలో మన కోసం మనం ట్రస్ట్ ద్వారా చల్లపల్లిలో జరుగుతున్న స్మశానవాటిక అభివృద్ధికి దేవాంగుల కుటుంబ సభ్యులు తమవంతు సహకారం అందించారు. స్థానిక పడమరవీధిలోని 120 దేవాంగుల కుటుంబీకులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై రూ. 2. 85 లక్షల నగదును సమీకరించారు. స్వచ్ఛ చల్లపల్లి సారధులు డాక్టర్ డిఆర్కె. ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులను మంగళవారం కలిసి విరాళం నగదును అందచేశారు.