ఆగస్టు 15వ తేదీ నుంచీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. చల్లపల్లిలో 'సుపరిపాలనకు తొలి అడుగు' కార్యక్రమాన్ని శనివారం స్థానిక పడమరవీధిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించగా బాగుందని మహిళలు సంతోషంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.