గన్నవరం పరిధిలోని కేసరపల్లి వద్ద జరిగే హైందవ శంఖారావ సభకు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి హిందూ బంధువులు ఆదివారం అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ హైందవ శంఖారావ సభకు చల్లపల్లి ప్రఖండ ఏరియా నుంచి సుమారు అన్ని ప్రాంతాల నుంచి 11 బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపుగా 600 మంది వరకు సభకు తరలి వెళ్లారు.