చల్లపల్లి: భార్య చేతిలో భర్త హతం

51చూసినవారు
చల్లపల్లి: భార్య చేతిలో భర్త హతం
భర్త భార్య చేతిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘంటసాల మండలం దేవరకోట గ్రామానికి చెందిన బోలెం శ్రీనివాసరావు(45)కు సుమారు ఇరవై ఏళ్ల క్రితం చిట్టూర్పు గ్రామానికి చెందిన మంగమ్మతో వివాహమైంది. వారికి కుమారుడు కార్తీక్ ఉన్నాడు. చల్లపల్లిలో వారు ఉంటుండగా, భర్తను తరచుగా కొడుతున్న మంగమ్మ భర్తను కర్రతో కొట్టడంతో తగలరానిచోట తగిలి శ్రీనివాసరావు మృతిచెందాడు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు

సంబంధిత పోస్ట్