రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులు, కౌలురైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుత్తికొండ రామరావు డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం అందించాలని కోరారు. రైతు సంఘం ఆధ్వర్యంలో చల్లపల్లి తహసీల్దార్ వనజాక్షికి రైతులతో కలిసి వినతిపత్రం సోమవారం అందించారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.