కార్తీక మాసం పురస్కరించుకొని చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురులో ఉన్న ప్రాచీన శైవక్షేత్రం శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం లక్ష బిల్వార్చన నిర్వహించారు. అవనిగడ్డకు చెందిన పోతరాజు శ్రీనివాసరావు, పోతరాజు వెంకటరమణ సోదరుల ద్రవ్య సహకారంతో లంక శ్యామసుందర శాస్త్రి నేతృత్వంలో ఇరవై మంది వేద పండితులు ఈ కార్యక్రమం నిర్వహించారు.