ప్రముఖ రంగస్థల కళాకారుడు బోలెం రామారావుకు ఉగాది, మహనీయుల ప్రత్యేక అవార్డుగా జాతీయ బంగారు నంది అవార్డు - 2025 లభించింది. ఉగాది, అంబేద్కర్ జయంతి అవార్డు ప్రత్యేక వేడుకల పేరుతో హైదరాబాద్ కు చెందిన జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ వారు ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో రామారావుకు బంగారు నందిని అందించారు. డాక్టర్ విఆర్. శ్రీనివాసరాజు చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.