పేద ప్రజలపై భారం మోపే స్మార్ట్ మీటర్లను రద్దుచేయాలని సీపీఐ అవనిగడ్డ నియోజకవర్గ కార్యదర్శి గుత్తికొండ రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయనున్న స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా శనివారం చల్లపల్లి ప్రధాన సెంటర్ లో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు గుదిబండగా మారుతున్న స్మార్టీమీటర్ల విధానాన్ని రద్దుచేయాలని కోరారు.