చల్లపల్లి: మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్ మృతికి నివాళులు

65చూసినవారు
చల్లపల్లి: మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్ మృతికి నివాళులు
చల్లపల్లి రాజా కుమారులు, బందరు మాజీ ఎంపీ యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ మృతి తీరనిలోటని చల్లపల్లి గ్రామ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అంకినీడు ప్రసాద్ చిత్రపటానికి సర్పంచ్, వార్డు సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లపల్లి రాజా వంశీయులు ప్రభువులుగా, ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈఓ పీవీ.మాధవేంద్రరావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్