చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవాలయ ప్రతిష్టా మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రతిష్ట మహోత్సవంలో భాగస్వాములు అయ్యారు. నూతనంగా ప్రతిష్ట గావించబడిన గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, సర్పంచ్ కృష్ణకుమారి, ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు.