చల్లపల్లి: అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధం

52చూసినవారు
చల్లపల్లి: అగ్నిప్రమాదంలో పూరిల్లు దగ్ధం
చల్లపల్లి మండలం మంగళాపురం బీసీ కాలనీలలో గౌరిపర్తి శ్రీనివాసరావుకు చెందిన పూరిల్లు శుక్రవారం అగ్నిప్రమాదంలో దగ్ధమై భారీ ఆస్థినష్టం సంభవించింది. మినుములు అమ్మగా వచ్చిన రూ.4లక్షల పైగా నగదును ఇంటిలో ఉంచటంతో ప్రమాదంలో నగదు, ఐదు తులాల బంగారం, వస్తు సామాగ్ని, ఇంటి పత్రాలు సర్వం అగ్నికి ఆహుతిగా మారి నిరాశ్రయులయ్యారు. శ్రీనివాసరావు కూలీ పనికి వెళ్లిపోగా భార్య, వికలాంగురాలైన కుమార్తె ఇంటిలో ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్