గోవుల అక్రమ రవాణాను చల్లపల్లి మండల పశువైద్యాధికారి డాక్టర్ పి. మనోజ్ కుమార్, పోలీసు సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన వ్యక్తులు చల్లపల్లి పరిసర ప్రాంతాల నుంచీ అక్రమ రవాణాకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి డాక్టర్ మనోజ్ కుమార్, పోలీసు సిబ్బంది సహాయంతో నడకుదురు కరకట్టపై కాపలాకాసి ఆవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.