చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి అవనిగడ్డ నియోజకవర్గ ఖ్యాతిని దేశ స్దాయికి తీసుకెళ్లడం గర్వదాయకమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చల్లపల్లి పంచాయితీ కేంద్ర ప్రభుత్వ పురస్కారం సాధించడం వెనుక సర్పంచ్ కృష్ణకుమారి నిరంతర కృషి, సేవాతత్పరత, అంకితభావం ఉన్నాయన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని సర్పంచులు ఆదర్శ గ్రామాలుగా రూపొందించుకోవాలన్నారు.