డిసెంబర్ 7, 8 , 9వ తేదీలలో హర్యానాలో జరిగే జాతీయస్థాయి స్క్వే పోటీలకు చల్లపల్లిలోని మదర్ థెరీసా హైస్కూల్ విద్యార్థులు నలుగురు ఎంపికైనట్లు స్కూల్ కరెస్పాండెంట్ ఆండ్రూ గోమ్స్ తెలిపారు. బుధవారం పాఠశాలలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ లో భాగంగా విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్క్వే ఛాంపియన్ షిప్ పోటీలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు.