చల్లపల్లిలోని శ్రీధర్మశాస్త్ర దేవాలయం ఆరవ వార్షికోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు శ్రీ అయ్యప్పస్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అయ్యప్ప స్వామి వారి 108 చరణాలు 108 సార్లు పారాయణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. సాయంత్రం అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.