జగ్గయ్యపేట మండలంలోని ధర్మవరప్పాడు తండాలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం గ్రామస్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. గ్రామంలోని 6, 7, 8వ తరగతులను జయంతిపురం పాఠశాలలో విలీనం చేయడంతో పిల్లలు బాగా దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా తరగతులు కొనసాగించాలంటూ అధికారులను కోరుతున్నారు.