గ్రామపంచాయతీకి సిమెంట్ బల్లలు బహుకరణ

55చూసినవారు
గ్రామపంచాయతీకి సిమెంట్ బల్లలు బహుకరణ
అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామపంచాయతీకి దాతలు రెండు సిమెంటు బల్లలను బహుకరణగా బుధవారం అందజేశారు. శ్రీహరిరావు - లలితాదేవిల జ్ఞాపకార్థం వారి కుమారుడు - కోడలు రామారావు - అరుణలు సిమెంట్ బల్లలను సర్పంచ్ వాకా రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను సర్పంచ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బండే శేషగిరిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్