పునరావాస కేంద్రాలకు దాతలు సహకారం ఆదర్శనీయమని టిడిపి నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, బండే రాఘవ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న ఎడ్లంక వరద బాధితుల కోసం 2వ వార్డ్ బెతేల్ చర్చి నిర్వాహకులు బొండాడ ఆర్ధర్ పాల్ కుమారులు బొండాడ పాల్ మేయర్, జార్జ్ ముల్లర్ రూ. 26 వేలు విలువైన నిత్యావసర సరుకులు అధికారులకు అందచేశారు.