చేపల మార్కెట్ లో వసతుల కల్పనకు కృషి చేస్తా

50చూసినవారు
చేపల మార్కెట్ లో వసతుల కల్పనకు కృషి చేస్తా
నాగాయలంక ఎండు చేపల మార్కెట్ లో మహిళా మత్స్యకారులు ఎదుర్కుంటున్న సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని అవనిగడ్డ మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆర్. ప్రతిభ అన్నారు. మంగళవారం ఆమె నాగాయలంక మార్కెటింగ్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి కృష్ణమూర్తి, జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ డైరెక్టర్ నాగిడి తాతారావులతో కలసి మార్కెట్ ను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్