మరియమాత మోక్షారోహణ పండుగ

59చూసినవారు
మరియమాత మోక్షారోహణ పండుగ
చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు సాలిపేటలోని ఆర్. సి. యం చర్చిలో శుక్రవారం మరియమాత మోక్షారోహణ పండుగ నిర్వహించారు. ముఖ్య వక్తగా మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ కరెస్పాండెంట్, ఆర్. సి. యం ఫాదర్ వి. జోజిబాబు విచ్చేసి ప్రసంగించారు. మరియ మాత ఆత్మ శరీరంతో దివికి వెళ్లిన విధానాన్ని, క్రీస్తు శాంతి సందేశాలను వివరించారు. ఆత్మ శరీరంతో మోక్షానికి ఎత్తబడిన ప్రవక్తలు హానోకు, ఏలియాలను గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్