విద్యార్థులందరు మంచి క్రమశిక్షణతో పెరిగి భవిష్యత్తులో ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదగాలని గోగినేనిపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు ఆకాంక్షించారు. గురువారం పాఠశాలలో 10వ తరగతి చదువు పూర్తి చేసిన విద్యార్థులకు వీడ్కోలు సభ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.