ఘంటసాల: బస్ షెల్టర్ నిర్మాణం అభినందనీయం

84చూసినవారు
ఘంటసాల: బస్ షెల్టర్ నిర్మాణం అభినందనీయం
ప్రయాణీకుల సౌకర్యార్థం దాతలు బస్ షెల్టర్ నిర్మించటం అభినందనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం కరకట్టపై కొండవీటి పాండురంగారావు - సీతారావమ్మ జ్ఞాపకార్థం సుగ్గన సురేంద్ర - మాధవి దంపతులు రూ. 3 లక్షల ఆర్ధిక సౌజన్యంతో నిర్మించిన బస్ షెల్టర్ ను ఎమ్మెల్యే బుద్దప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన చేయటం మంచి విషయమన్నారు.

సంబంధిత పోస్ట్