రైతులు నూతన సాంకేతిక విధానాలు అవలంబించాలని అమ్మిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట గ్రామంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వరి సాగులో నూతన పద్ధతులు అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు అని తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు అందజేశారు.