నూతన సాంకేతిక విధానాలను రైతులు అవలంబించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం దేవరకోటలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వరి సాగులో నూతన పద్ధతులు అవలంబించడంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు.