రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఘంటసాల మండలం లంకపల్లిలో గుండేరు నుండి పంటకాలువలకు లిఫ్ట్ ద్వారా సాగునీరును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లంకపల్లి, పూషడం, యండకుదురు, పాత మాజేరు గ్రామాలలోని రెండు వేల ఎకరాలకు పంటకాలువల ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు.