ఘంటసాల మండలంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. తొలుత ఈదురు గాలులతో వర్షం కురువగా, అనంతరం జల్లులతో కూడిన వర్షం పడుతుంది. మట్టి రహదారులు బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉండడంతో బయటికి వచ్చేందుకు ప్రజల అవస్థలు పడ్డారు. విద్యుత్ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.