ఘంటసాల: స్వామివారిని దర్శించుకున్న జస్టిస్ దుర్గాప్రసాద్

73చూసినవారు
ఘంటసాల: స్వామివారిని దర్శించుకున్న జస్టిస్ దుర్గాప్రసాద్
ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వరస్వామివారిని జస్టిస్ యు. దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. తొలుత ఆలయ వేదపండితులు ఆయనకు ఘన స్వాగతం పలుకగా, ప్రత్యేక పూజలు దుర్గాప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ డిప్యూటీ కమీషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్