ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాలపాలెం గ్రామంలో రూ. 50 లక్షల నిధులతో నిర్మించిన పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్ బుధవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.