రోడ్డు ప్రమాద ఘటన స్థలిని జనసేన నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. శుక్రవారం ఉదయం ఘంటసాల మండలం యండకుదురు శివారు జీలగలగండి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ - బొలోరా వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బొలోరాలో ఉన్న ఇరువురు మృతి చెందారు. చల్లపల్లి సీఐ కే. ఈశ్వరరావు, ఘంటసాల ఎస్ఐ ప్రతాపరెడ్డి చేపట్టిన సహాయక చర్యలను పిఠాపురం సభకు బయలుదేరిన ఆయన మార్గమధ్యలో పరిశీలించారు.