ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. అగ్నిహోత్రం భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులచే లక్ష తులసి పూజ, నవ గ్రహ హోమం, శాంతి కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ దేవస్థానానికి విచ్చేయగా, ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాద్ ఆధ్వర్యంలో పండితులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.