డ్రోన్ సహాయంతో పేకాట రాయుళ్ళను ఘంటసాల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరమాచినేనిపాలెం గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఘంటసాల ఎస్సై ప్రతాప్, సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 19,300ల నగదు స్వాధీనం చేసుకొని ఘంటసాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.