ఘంటసాల: రహదారి తవ్వి వదిలేయటంతో ఇబ్బందులు

73చూసినవారు
ఘంటసాల గ్రామం నుంచి చిలకలపూడి వెళ్లే రహదారిని మూడు నెలల క్రితం తవ్వి అలాగే వదిలి వేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘంటసాల గ్రామం నుంచి ప్రతినిత్యం వందలాది వాహనాలు చిలకలపూడి మీదుగా మొవ్వ మండలానికి వెళ్తుంటాయి. నూతన రహదారి నిర్మాణానికి రహదారిని తవ్వి వదిలివేయడంతో రాళ్లు పైకి తేలి వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాంట్రాక్టర్ ఆలస్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

సంబంధిత పోస్ట్