తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు ధాన్యం తరలింపులో నిబంధనలు సడలించినట్లు ఏవో కె. మురళీకృష్ణ గురువారం రైతులకు తెలిపారు. రైతులు ముందుగా గ్రామ వ్యవసాయ సహాయకుడికి ఫోన్ ద్వారా లేదా స్వయంగా సంప్రదించిన యెడల కేవలం 10 నిముషాల్లో ధాన్యం షెడ్యూలింగ్ చేయబడుతుందన్నారు.