రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం గ్రామంలో వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందించిన వరి విత్తనాలను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోపు ప్రభుత్వం నగదు జమ చేసిందన్నారు.