విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాసు, కృష్ణా నాయక్ తెలిపారు. సోమవారం ఘంటసాల మండలంలో 50 మంది అధికారులు 32 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. అదనపు లోడు వినియోగిస్తున్న 235 మందికి రూ. 6, 27, 400 జరిమానా విధించినట్లు వారు తెలిపారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే భారత విద్యుత్ చట్టం సెక్షన్ 185 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.