గుడివాడలోని మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జరిగిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో శ్రీకాకుళం జడ్పీ హై స్కూల్ విద్యార్థిని టీ. హన్సిక ఫణి దేవి ప్రథమ స్థానం సాధించింది. ఫింగర్ ప్రింట్ బేస్డ్ కార్ డిటెక్టర్ అనే ఎగ్జిబిటుకు వ్యక్తిగత విభాగంలో జిల్లా స్థాయికి ఎంపిక అయ్యి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమ్మి రెడ్డి అనుపల్లవి భువనేశ్వరి గురువారం తెలిపారు.