ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్తగా విధులు నిర్వహిస్తున్న డా. డి. సుధారాణి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం గురువారం అందుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెరుకు పంటలో 2024 - 25వ చేపట్టిన పరిశోధన గాను ఉత్తమ శాస్త్రవేత్తగా బంగారు పతకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చన్నాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బూడిది రాజశేఖర్ చేతులమీదుగా అమరావతిలో అందుకున్నారు.