ఘంటసాల మండల పరిధిలోని చిట్టూర్పు గ్రామంలో 2 ఎకరాల 25 సెంట్లు వరి కుప్ప దగ్ధమైంది. చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన కౌలు రైతు మట్టా విజయ రాజు చిట్టూర్పు గ్రామంలో వరి సాగు చేశాడు. శనివారం ఉదయమే వరికుప్ప నుంచి మంటలు రావడంతో స్థానికులు సమాచారం అందించారు. వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక శాఖ వారికి తెలియజేయడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రూ. 1. 50 లక్షలు నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు