గ్రామాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పథకం కూలీలకు అవగాహన కల్పించారు. స్వచ్చాంద్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఘంటసాల మండలంలోని ఉపాధి కూలీలచే పంచాయతీ కార్యదర్శులు ప్రతిజ్ఞ చేయించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని, ఇంటిలోని వ్యర్ధాలను పంచాయతీ చెత్త బండిలో వేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కరపత్రాలు అందించారు.