గ్రామాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని ఘంటసాల డిప్యూటీ ఎంపీడీవో వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని చిలకలపూడి గ్రామంలో ఆయన పర్యటించి గ్రామస్తులకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ప్రతిరోజు గ్రీన్ అంబాసిడర్ లు ఇంటి వద్దకు వస్తారని, వారికి వేరువేరుగా తడి పొడి చెత్త ఇవ్వాలని తెలిపారు. రహదారుల వెంబడి చెత్తాచెదారం పడేయవద్దని సూచించారు.