ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్తూపం వద్ద యోగాంధ్ర కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తొలుత బుద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా శిక్షకులు వివిధ ఆసనాలను వేయించి ఆరోగ్య సంరక్షణపై సూచనలు చేశారు. అవనిగడ్డ డీఎస్పీ విద్య శ్రీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు పాల్గొన్నారు.