ఘంటసాల బౌద్ధ స్థూపం వద్ద నిర్వహించే జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని డిప్యూటీ కలెక్టర్ పోతురాజు అన్నారు. ఘంటసాలలోని బౌద్ధ స్థూపం వద్ద ఈ నెల 13న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లను డిప్యూటీ కలెక్టర్ స్థానిక అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. పోతురాజు మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.