బాలికలు రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని పోషకాలు కలిగి ఉండే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని గోగినేనిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ్మన వేణుగోపాలరావు సూచించారు. 7వ పౌష్టికాహార పక్షోత్సవాలలో భాగంగా ఈరోజు గోగినేనిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.