ఘంటసాల గ్రామంలోని అమరావతి బుద్ధవిహార్ లో బౌద్ధ బిక్షువు బంతేజీ గురుపూర్ణిమ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఘంటసాల హై స్కూల్ బాలబాలికలకు ధ్యానం నేర్పించి వారికి నగదుగా బహుమతులు అందించారు. బాలికలతో ప్రధమ బహుమతి పొందిన మాధవీలతకి రూ. 1000, ద్వితీయ బహుమతి పొందిన రేచల్ల జ్యోతికి రూ. 500, బాలురులో ప్రధమ బహుమతి పొందిన భార్గవకి రూ. 1000, ద్వితీయ బహుమతి పొందిన ఆదిత్యకు రూ. 500 నగదు అందించారు.