భార్య మీద అనుమానంతో మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూషడుపు దామోదర రావు (40) సోమవారం రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహం అప్పగించామని పోలీసులు తెలిపారు.