కోడూరు: గంగానమ్మకు ఘనంగా ఆషాడ సారె సమర్పణ

10చూసినవారు
కోడూరు: గంగానమ్మకు ఘనంగా ఆషాడ సారె సమర్పణ
కోడూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి కి కోడూరు కాపుల కాలనీ వాసులు, తూర్పు వైపు భక్తులు ఆషాడ సారె ఘనంగా సమర్పించారు. ఆదివారం అమ్మవారికి ఆషాఢ సారెను భక్తులు మేళతాళాల మధ్య పసుపు, కుంకుమ, పళ్ళు, చలిమిడి, అరేసలు, పాలు పొగళ్లు, పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా వెళ్లి సాంప్రదాయ బద్ధంగా అందించి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్