కోడూరు: సముద్రంలో గుంతలు ఉంటాయి జాగ్రత్త

65చూసినవారు
కోడూరు: సముద్రంలో గుంతలు ఉంటాయి జాగ్రత్త
హంసలదీవి సముద్రంలో గుంతలు ఉంటాయని స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని మెరైన్ ఎస్సై పూర్ణ మాధురి తెలిపారు. ఆదివారం కోడూరు మండల శివారు పాలకాయ తిప్ప బీచ్ వద్ద సరదాగా గడిపేందుకు, కుటుంబ సమేతంగా స్నానాలు చేసేందుకు సందర్శకులకు పలు సూచనలు సలహాలు అందించారు. సముద్రతీరంలో పిల్లలని ఒంటరిగా వదలరాదని హెచ్చరించారు. మెరైన్ సిబ్బంది తీరం వెంబడి గస్తీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్