కోడూరు మండలం విశ్వనాధపల్లిలో వెలసి భక్త కోటి పూజలు అందుకుంటున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి అమ్మవారిని భక్తులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి అమ్మవారి ఆలయ వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారిని జనసేన నాయకులు వెంకట్రామ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారి అమ్మవారి ఆశీస్సులు అందచేసి ఘనంగా సత్కరించారు.